నెగిటివ్‌ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్దాం

రహదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది

వర్షాలు తగ్గగానే రహదారుల పనులు మొదలుపెట్టాలి

చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియాతోనూ మనం యుద్ధం చేస్తున్నాం

ఆర్‌అండ్‌బీ, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రహదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అక్టోబర్‌ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని, మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని, పకడ్బందీగా రహదారుల నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలతో పాటు పారిశ్రామికవాడలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకు టెండర్లు పిలిచామన్నారు. మిగిలిన చోట్ల ఎక్కడైనా టెండర్లు పిలకపోతే వెంటనే పిలవాలని సూచించారు. అక్టోబర్‌లో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవాలని, నివేదిక ఆధారంగా దృష్టిపెట్టి చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత విభాగాలతో చర్చించి కార్యాచరణ చేపట్టాలన్నారు.

ఈ సందర్భంగా  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...?

అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి: సీఎం
తర్వాత పనుల కాలం మొదలవుతుంది :
ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి:
మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి: అధికారులకు సీఎం ఆదేశం
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం:
గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు:
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి:
దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు:
వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి:
రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది:
వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంది:
ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది:
దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు పచ్చమీడియాతోనూ మనం యుద్ధం చేస్తున్నాం:
ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు:
అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు:
ఇవన్నీ ఉన్నాకూడా, నెగెటివ్‌ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం:
ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం:
మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే... నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు:
మనం బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయి:
రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు:
మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవండి: అధికారులకు సీఎం ఆదేశం
అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి:
క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోండి:
మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించండి:
నివేదికలు ఆధారంగా ఫోకస్‌ పెట్టి వాటిని బాగుచేయండి:
సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చుని కార్యాచరణచేయండి అధికారులకు సీఎం స్పష్టీకరణ

బ్రిడ్జిల వద్ద అప్రోచ్‌ రోడ్లు పూర్తికాక చాలా రోడ్లు అసంపూర్తిగా ఉండిపోయాయి:
చాలా సంవత్సరాలుగా ఇవి అలానే ఉండిపోయాయి:
నా పాదయాత్రలో చాలా చోట్ల చూశాను: సీఎం
వీటిని వెంటనే పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధంచేసి, పనులు పూర్తిచేయాలని ఆదేశించిన సీఎం 

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో రూ. 6,400 కోట్ల ఖర్చుతో కొత్తరోడ్లకు కార్యాచరణ:
మండల కేంద్రాలనుంచి జిల్లాకేంద్రాలకు రెండు లేన్లతో మంచి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం:
ప్రాజెక్టు వివరాలను సీఎంకు తెలిపిన అధికారులు
ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశం

రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రగతి, ప్రతిపాదనలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్‌లో చేపడుతున్నామన్న అధికారులు
విశాఖపట్నంలో  షీలానగర్‌ – సబ్బవరం జాతీయ రహదారిపైనా దృష్టిపెట్టామన్న అధికారులు
విశాఖపట్నం సిటీ గుండా అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే రహదారిలో ప్రధానమైన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమయ్యామన్న అధికారులు
దీనివల్ల సిటీలో ట్రాఫిక్‌ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయన్న అధికారులు
ఈ రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వీలైనంత త్వరగా కార్యరూపంల దాల్చేలా తగిన చర్యలుతీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం 
దీనికోసం జాతీయ రహదారుల అధికారులతో సమన్వయంచేసుకోవాలన్న ముఖ్యమంత్రి 

నడికుడి – శ్రీకాళహస్తి, కడప– బెంగళూరు, కోటిపల్లి–నర్సాపూర్, రాయదుర్గ్‌ – తుంకూర్‌ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశం
మరికొన్ని మార్గాల్లో డబ్లింగ్‌ పనులు ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

పోర్టుల నిర్మాణంపైనా సీఎం సమీక్ష:
రాష్ట్రంలోని పోర్టులు, వాటి ద్వారా సరుకురవాణా తదితర అంశాలను సీఎంకు వివరించిన అధికారులు
పోర్టులతో రోడ్లు, రైల్వేల అనుసంధానంపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదనల వివరాలను తెలియజేసిన అధికారులు
రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం, పోర్టులపై సీఎం సమీక్ష

రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలడిగి, పోర్టు నిర్మాణ పనులపై సమీక్షించిన సీఎం
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామన్న అధికారులు
మొదటివిడతలో భాగంగా 25 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా:
మొదటివిడతలో నాలుగు బెర్తులు:
తొలివిడతలో రూ. 2647 కోట్లు నిర్మాణంకోసం ఖర్చు:
అక్టోబరు 1 నుంచి రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం అవుతాయన్న అధికారులు
బ్రేక్‌వాటర్‌ పనులు నవంబర్‌  మొదటివారంలో మొదలుపెడతామన్న అధికారులు
వచ్చే మే నాటికి కీలకమైన పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
భూ సేకరణ పనులు, సహాయ పునరావాస పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు
పోర్టుల వద్ద కాలుష్యాన్ని నియంత్రించాలన్న సీఎం
దీనిపై కొత్తగా నిర్మించనున్న పోర్టుల వద్ద ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలన్న సీఎం

భావనపాడు పోర్టుపైనా సీఎం సమీక్ష
అక్టోబరు చివరి నాటికి భావనపాడు పోర్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్న అధికారులు
ఫేజ్‌ –1లో మిలియన్‌ టన్నుల కార్గో రవాణా
మొదటి విడతకు రూ.2956 కోట్ల ఖర్చు

మచిలీపట్నం పోర్టుకు సెప్టెంబరు 14లోగా టెండర్ల ప్రక్రియ ముగుస్తుందన్న అధికారులు
మొదటి ఫేజ్‌లో 35 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా
మొదటి విడతలో రూ. 3650 కోట్ల ఖర్చు 
30 నెలల్లోగా పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
మచిలీపట్నం తీర ప్రాంతంలో మట్టి ఎక్కువగా ఉందని, ఇలాంటి చోట ఎలాంటి నిర్మాణ ప్రక్రియలను అనుసరించాలన్న దానిపై అంతర్జాతీయ నిపుణులను సంప్రదించామని, పోర్టు నిర్మాణంలో వినూత్న ప్రక్రియలను పాటిస్తున్నామన్న అధికారులు

కాకినాడ ఎస్‌ఈజెడ్‌ గేట్‌వే పోర్టుకు అపార అవకాశాలున్నాయన్న సీఎం
భూములు విస్తారంగా ఉండడం వల్ల విస్తారంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం
ఈ పోర్టుకు రోడ్లు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయాలన్న సీఎం

పోర్టులున్న ప్రాంతాల్లో ఫ్రీ ట్రేడ్‌ వేర్‌ హౌసింగ్‌ జోన్స్‌ను అభివృద్ధిచేయలని సీఎం సూచన

రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 9 ఫిషింగ్‌ హార్బర్ల ప్రగతిపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
మొదటి విడతలో 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం
ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె వద్ద మొదటి విడతలో నిర్మిస్తున్న ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణప్రగతిపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
వచ్చే ఏడాది మే – జూన్‌నాటికి మొదటి ఫేజ్‌ హార్బర్లను పూర్తిచేస్తున్నామన్న అధికారులు
రెండో విడతలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, వాడరేవుల వద్ద పిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై సీఎం సమీక్ష
కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్న సీఎం 
వీలైనంత త్వరగా నిర్మాణం ప్రారంభించడానికి అన్నిచర్యలూ తీసుకోవాలన్న సీఎం
మిగిలిన ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపనులపై సమీక్షచేయాలని సీఎం ఆదేశం
వీటికి సంబంధించి పెండింగ్‌ అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
కర్నూల, కడపల నుంచి విశాఖపట్నానికి విమాన సౌకర్యాన్ని పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
విశాఖపట్నం, తిరుపతి ఎయిర్‌పోర్టులనుంచి ఇంటర్నేషనల్‌ కనెక్టివిటీని అభివృద్ధిచేయాలన్న సీఎం 

ఈ సమీక్షా సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కె వెంకటరెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Back to Top