స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలి

పెళ్లిళ్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, 150 మందికే అనుమతి 

కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం వై య‌స్ జ‌గ‌న్‌ సమీక్ష 

తాడేపల్లి: స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ మంగళవారం కోవిడ్‌ నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ వేసుకుంటూ వెళ్లాలని సూచించారు.

 ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని పేర్కొన్నారు. పెళ్లిళ్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని,150 మందికే అనుమతి ఉంటుందని చెప్పారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఇబ్బందులు రాకూడదని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రుల్లో "నాడు-నేడు" పనులు వేగంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. 

Back to Top