ఆర్థికశాఖపై సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి : వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు, వివిధ ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సమీక్ష కొనసాగనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వివేది, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top