భూ సంస్కరణల ప్రయోజనాలపై విస్తృత్రంగా ప్రచారం చేయాలి

జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షపై స‌మీక్ష‌లో సీఎం వైయస్ జగన్ 

ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది

ప్రజల్లో ఆందోళన కలిగించేలా తప్పుడు రాతల‌ను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది 

రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాం

 తాడేప‌ల్లి: భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృత్రంగా ప్రచారం చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. రెవిన్యూ విభాగంలో విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి కారణంగా ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై సమాచారాన్ని ప్రజల్లోకి పంపాల‌న్నారు.  ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంద‌ని,  మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేక… వక్రీకరిస్తోంద‌న్నారు.  ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తోంద‌ని చెప్పారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా తప్పుడు రాతలు రాస్తోంద‌ని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంద‌ని ఆదేశించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న‌న్న‌శాశ్వత భూహక్కు, భూరక్షపై  సీఎం వైయస్ జగన్  మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

స‌మీక్ష‌లో ముఖ్యాంశాలు:
- చాలా రాష్ట్రాల్లో మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉంటే మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారు. 
- భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోంది:
- రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాం:
- ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది:
- ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నాం:
- ఇన్ని సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుంటే దానిపై తప్పుడు రాతలు, వక్రీకరణలు చేస్తున్నారు:
- మన ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలు, వాటి వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను సమగ్రంగా వివరించాలి :       

మనం చేస్తున్న ఈ మంచి ప్రజల్లోకి పోవాలి.

వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం సమగ్ర సర్వేలో ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు.
13,460 గ్రామాలకు గాను, 12,836 గ్రామల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లైయింగ్‌ పూర్తి.
ఈ పనిని అక్టోబరు 15లోగా పూర్తిచేస్తామన్న అధికారులు.
81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తియిందన్న అధికారులు.
60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను జిల్లాలకు పంపే పని పూర్తిచేయాలి.
సర్వేలో పాలు పంచుకుంటున్న 3,240 రోవర్లు.
గతంతో పోలిస్తే అదనంగా 1620 రోవర్లు. 

ఫేజ్‌ -1లోగా భాగంగా తొలివిడతలో 2 వేల గ్రామాల్లో అన్నిరకాలుగా సర్వే పూర్తి.
మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్‌ డివిజన్లు, 19వేల సరిహద్దు సమస్యల పరిష్కారం, సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూ హక్కు పత్రాలు పంపిణీ పూర్తయిందన్న అధికారులు.

ఫేజ్‌-2లో భాగంగా మరో 2వేల గ్రామాల్లో భూహక్కుపత్రాలు పంపిణీకి సన్నాహాలు. 
అక్టోబరు 15 నాటికి రెండో దఫా సర్వే చేపడుతున్న  గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు. 
  
ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ ఇంకా ఏమన్నారంటే... :

  • ఫేజ్‌-2లో సర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి అన్నిరకాలుగా సిద్ధం కావాలని సీఎం ఆదేశం. 
  • మొదటి దశలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలపై పూర్తిస్థాయిలో సమీక్ష చేయాలన్న సీఎం. 
  • ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఏర్పాటు చేశాం:
  • గ్రామ సచివాలయాల్లో రిజస్ట్రేషన్‌ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే:
  • అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్‌ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • మున్సిపల్‌ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని వివరించిన అధికారులు.
  • 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్‌ పూర్తయ్యిందన్న అధికారులు.
  • 66 మున్సిపాల్టీల్లో ఇప్పటికే ఓఆర్‌ఐ ప్రక్రియ ముగిసిందన్న అధికారులు.
  • ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలన్న సీఎం.
Back to Top