కోవిడ్‌ నివారణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం

వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిసారించాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కరోనా నివారణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని, వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిసారించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు. అర్బన్‌ ప్రాంతాలతో పాటు రూరల్‌ల్లో కూడా వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ‘నాడు–నేడు’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. రోజుకు సగటున 1.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. తగినన్ని డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని, అర్బన్‌ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 
 

Back to Top