తాడేపల్లి: వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరటిని స్థానిక మార్కెట్లకు పంపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అదే విధంగా ఆక్వారంగ పరిస్థితులపై ఆరా తీశారు. ఇతర రాష్ట్రాలకు చేపల రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమెరికా, యూరోప్ లాంటి దేశాలకు రొయ్యలను ఎగుమతి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద ధరలతో కూడిన బోర్డులు కచ్చితంగా ఉండాలన్నారు. నిత్యవాసరాలను ఎక్కవ ధరలకు అమ్మితే ఆ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.