ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం వైయస్ జగన్‌కు వైయస్‌ఆర్ సీపీ ఎంపీలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీలు, పెండింగ్ బిల్లులపై ప్రధానితో చర్చించనున్నారు.