గుడివాడ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

కృష్ణా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితమే గుడివాడ చేరుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం.. గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియానికి చేరుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మహాశివుడికి నిర్వహించనున్న అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొంటారు. 

Back to Top