బలిఘట్టం చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

అనకాపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని బలిఘట్టం చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా 470 కోట్లతో నిర్మించే తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం, కాల్వల అనుసంధాన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జోగునాథునిపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 
 

Back to Top