ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై పోరాడిన అభ్యుద‌య వాది జాషువా

మ‌హాక‌వి జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళి 
 

తిరుప‌తి: ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై పోరాడిన అభ్యుద‌య వాది క‌వి శ్రీ గుర్రం జాషువా అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. మ‌హాక‌వి జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళి అర్పించారు. ఈ మేర‌కు సీఎం బుధ‌వారం ట్వీట్ చేశారు. క‌విత్వ‌మే ఆయుధంగా మూఢాచారాల‌పై తిర‌గ‌బ‌డ్డ ఆధునిక తెలుగు క‌వి శ్రీ గుర్రం జాషువా. వ‌డ‌గాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేద‌రికం, వ‌ర్గ సంఘ‌ర్ష‌ణ‌, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై పోరాడిన అభ్యుద‌య వాది జాషువా. మ‌హాక‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి అర్పిస్తున్నాను అంటూ ట్విట్ట‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top