ఢిల్లీలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సన్నాహక సదస్సు ప్రారంభం

హాజరైన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, వివిధ దేశాల దౌత్యవేత్తలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సన్నాహక సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరుగుతున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా వివిధ దేశాల దౌత్యవేత్తలు, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తొలుత వివిధ దేశాల దౌత్యవేత్తలతో జరగనున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను సీఎం వైయస్‌ జగన్‌ వివరించనున్నారు. స‌ద‌స్సుకు మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, గుడివాడ అమ‌ర్‌నాథ్, సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top