గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌పై ఉన్న‌తస్థాయి క‌మిటీకి సీఎం ఆదేశం

అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఏపీ ప్ర‌భుత్వం సీరియస్‌గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహరెడ్డి ఆదేశించారు. ఘ‌ట‌న‌పై ఉన్న‌త స్థాయి క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భ‌విష్య‌త్‌లో  ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.  అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో సెప్టీ ఆడిట్ జ‌రిపించాల‌ని సూచించారు. 

అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్‌ లీకైన ఘటనపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు.  జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Back to Top