ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు

ఆదేశాలు జారీ చేసిన సీఎం వైయస్‌ జగన్‌
 

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మే నెల నుంచీ పూర్తి జీతం ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సిఎఫ్ఎంఎస్ మార్పులు చేయనున్నది. నేటి సాయంత్రం లేదా రేపటికల్లా సిఎఫ్ఎంఎస్‌లో మార్పులు అందుబాటులోకి రానున్నాయి.  కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కొంత శాతం జీతాలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం విధితమే. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top