తాడేపల్లి: లాక్‌డౌన్ నేపథ్యంలో నడుచుకుంటూ తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీల సరిస్థితిని చూసి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల వలస కూలీలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మానవీయ కోణాన్ని మరచిపోవద్దంటూ అధికారులకు సూచించారు. వలస కూలీల కోసం బస్సులు తిప్పేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. అందుకోసం విధివిధానాలను తయారు చేయాలని సూచించారు. ఏపీ గుండా నడిచి వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని, నడిచివెళ్తున్న కూలీలు ఎక్కడ తారసపడ్డ వారిని బస్సుల్లో ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలని వైయస్ జగన్ సూచించారు. వలస కూలీలను టికెట్లు కూడా ఆడగవద్దని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు.