గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

మున్సిపాలిటీల్లో సదుపాయాల కల్పనపై సీఎం వైయస్‌ జగన్‌  సమీక్ష

నదీ పరివాహక ప్రాంతాలకు భంగం కలుగకుండా చర్యలు

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. తాగునీరు, కరెంటు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మున్సిపల్‌ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.మున్సిపాలిటీల్లో సదుపాయాల కల్పనపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు.తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి శుద్ధి,పర్యావరణ పరిరక్షణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ స్కూళ్ల అభివృద్ధిపై కూడా సమీక్ష నిర్వహించారు.ప్రతి మున్సిపాలిటీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలన్నారు.పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ వినతిపత్రం వచ్చినా వాటిని అడ్రస్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సూచించారు. కృష్ణానది కట్ట, కాల్వగట్లపై ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలన్నారు. వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రెండు సెంట్ల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతాలకు భంగం కలుగకుండా చూడాలని తెలిపారు.

Back to Top