సిమ్లా పర్యటనకు వెళ్లిన సీఎం వైయ‌స్‌ జగన్‌

అమ‌రావ‌తి: సీఎం వైయ‌స్‌ జగన్‌ గురువారం సిమ్లా పర్యటనకు వెళ్లారు. తొలుత తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆయన ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు.విమానాశ్రయంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ హర్షవర్థన్‌రాజు, పలువు రు అధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు.

Back to Top