ప్రకాశం జిల్లా: పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు చంద్రబాబు అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం.. జెండాలు కట్టి వాళ్లు.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అంటూ సీఎం వైయస్ జగన్ దుయ్యబట్టారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా కొనకనమిట్ల సభ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..: బిందువు బిందువు సింధువైన జనసముద్రం. మన ప్రకాశం జిల్లాలో పొదిలిలో ఈరోజు ఇక్కడ నా కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యం చూస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తోంది. బిందువూ బిందువూ చేరి సింధువైనట్టు.. ఇక్కడొక జనసముద్రం కనిపిస్తోంది. ఇసుక వేసినా కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ ఒక ప్రజా కెరటం కనిపిస్తోంది. మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా, ఆ మంచిని కొనసాగించేందుకు చేయీ చేయీ కలిపి ఓ కెరటంలా గట్టిగా చేస్తున్న నినాదం.. సిద్ధం.. సిద్ధం. పేదల భవిష్యత్తును ఆడ్డుకునే కూటమిని ఆపేందుకు మీరు సిద్దమా? ప్రజల ఎజెండాతో మనం, జెండాలు జతకట్టి వారు.. తలపడుతున్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి, మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా.. సిద్ధమేనా? ప్రజల రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమి అయ్యి పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తున్న ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా.. సిద్ధమేనా? రాబేయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు గత ఐదేళ్లుగా మీ పిల్లలు, మీ పిల్లల బడులు, వారిచదువులు, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతుకు అందుతున్న భరోసా, పేద సామాజికవర్గాలకు అందిన న్యాయం.. ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు. అందుకే నేను చెబుతున్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు.. ఈ ఎన్నిక రాబోయే 5 సంవత్సరాల్లో మన భవిష్యత్ ఎలా ఉండబోతోంది? రెండు అడుగులు ముందుకు పడుతుందా? లేదా మనం మోసపోయి వెనక్కు పోతామా? అని నిర్ణయించే మన ఓటు ఈ ఓటు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. పథకాల కొనసాగింపునకు- ముగింపునకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఇవి జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో మీ బిడ్డది, జగన్ ది పేదల పక్షం అని గర్వంగా చెబుతున్నాను. కాబట్టి మీ ప్రతి ఓటూ మీకు మీరుగా మీ కుటుంబంగా, వచ్చే ఐదేళ్లూ ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది. మీకు, మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా? లేదా అని ఇవాళ మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. 5 వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్‌కు ఓటు వేస్తే జరిగే ప్రతి మంచీ కూడా కొనసాగింపు. అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు, మోసపోవటం. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆలోచించండి. బాబు దారి ఎప్పుడూ అడ్డదారే... చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారే. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియదు. ఈ చంద్రబాబు మార్క్ రాజకీయం ఏమిటంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేదేమిటి అంటే, ఆయనమార్క్ రాజకీయం ఏమిటి అంటే వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు.. ఇవీ చంద్రబాబుమార్క్ రాజకీయం. బాబు తన మనుషులతో ఫించన్ ఇంటికి రాకుండా ఆపించాడు. ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? తెలుసా అవ్వా.. ఏం చేశాడో తెలుసా తాతా? ఏం చేశాడో తెలుసా అక్కా? చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించాడు. ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా? అవ్వాతాతలకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదవారికి, ఆ పేదవారి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట. పెన్షన్లు ఆ పేదవాడి ఇంటికి వెళ్లకూడదట. అలా వెళ్లటం నేరమట. ఇదీ చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎలక్షన్ కమిషన్ తో తాను ఫిర్యాదు చేయించినది. ఒకటో తేదీన ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చే గొప్ప వ్యవస్ధ.. నేను ఒకటే ఆలోచన చేయమని మీ అందరితో అడుగుతున్నాను. గత 56 నెలలుగా.. ఇవాళ పెన్షన్లు కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 56 నెలలుగా జరుగుతోంది. ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే అది ఆదివారమైనా, సెలవుదినమైనా నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు, మనవరాళ్లు నేరుగా ఆ అవ్వాతాతల దగ్గరికి వెళ్లి పెన్షన్ వాళ్ల చేతిలో పెడుతున్న కార్యక్రమం.. ఇదొక్కటే కాదు.. చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత. రూ.1000 ఇస్తున్న ఆరో రోజుల్లో.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని రూ.3 వేలకు ఆ పెన్షన్ ను పెంచుకుంటూ పోయి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల ఒకటో తారీఖున ఆదివారమైనా, సెలవుదినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు. బాబు హయాంలో జన్మభూమి కమిటీల అరాచకం. ఆ చంద్రబాబు తన హయాంలో తాను పెట్టుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటూ, వివక్ష చూపుతూ ఆ ఇచ్చే అరకొర రూ.1000 పెన్షన్ కూడా ఎక్కడికెక్కడికో వెళ్లి పెద్ద పెద్ద క్యూలలో నిలబడి రోజులతరబడి ఎదరుచూస్తూ నరకయాతన పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన పాలన. వాలంటీర్ల వ్యవస్ధ– చంద్రబాబు గుండెల్లో రైళ్లు. దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే వచ్చి తీసుకొచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పని చేస్తోందంటే.. చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ రైళ్లు పరుగెత్తే విధంగా పని చేస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తన్నాడు. అవ్వాతాతల మరణానికి కారణమైన బాబు అన్యాయస్తుడు. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వాతాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్కచెల్లెమ్మలను, దివ్యాంగులను, వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైచిలుకు అవ్వలను, తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలొంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వాతాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడిని శాడిస్ట్ అనక మరేమంటారో మీరే చెప్పండి. మన హయాంలో 56 నెలలుగా ప్రతి నెలా 1వ తారీఖునే పెన్షన్ ను కచ్చితంగా సెలవుదినమైనా, ఆదివారమైనా కూడా సూర్యోదయానికంటే ముందే ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తుంటే.. ఈ ఎన్నికల సమయంలో అదీ అధికారం మన చేతుల్లో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది అంటే.. అదీ ఆగలేదు. కారణం.. అదీ ఆగబడింది కాబట్టి అది రాకుండా పోయింది. ఆలోచన చేయమని అడుగుతున్నాను. అసలు శాడిస్టే అంటే ఎవరంటే... ఇలా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ ఇంటికి పెన్షన్ ఇవ్వని ఈ చంద్రబాబు కుట్రలతోనూ, అక్కసుతోనూ ఆపించాడు. కాబట్టే ఈరోజు చంద్రబాబును నేను అడుగుతున్నా, ఈ దొంగల ముఠాను నేను అడుగుతున్నాను. శాడిస్ట్ అంటే ఎవరు అని? శాడిజం అంటే ఏమిటి అని? ఇదే పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబూ శాడిస్ట్ అంటే ఎవరు? శాడిజం అంటే ఏమిటి? ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేని వాడు శాడిస్ట్ అంటే. పేదవాడు పెద్దవాడు అవుతుంటే ఓర్వలేని వాడు శాడిస్ట్ అంటే. పేదలకు ఇళ్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తుంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకునే వాళ్లను శాడిస్ట్ అంటారు. వ్యవసాయం దండగ అని మాట్లాడిన మనిషిని శాడిస్ట్ అంటారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని రైతులను వెటకారం చేసిన మాటలు శాడిస్ట్ అంటే. శాడిస్ట్ కు అర్థం.. తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే.. ఆ ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ల పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు.. దీనిని శాడిస్ట్ అంటారు.. అవునా? కాదా? పేదలకు మంచి జరిగిస్తూ, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెడుతుంటే అడ్డుకుని అక్కసు వెళ్లగక్కిన బాబు ఇంతకన్నా పెద్ద శాడిస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా? అని అడుగుతున్నాను. పేదలకు అందిస్తున్న డీబీటీలో అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతోందని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది జగన్ మాదిరి బటన్లు నొక్కితే అని చెప్పి దేశ మంతా దిక్కుమాలిన ప్రచారం చేసిన బాబూ.. నిన్ను శాడిస్ట్ అనక ఇక ఏమనాలి? అని అడుగుతున్నాను. వాలంటీర్లను కించపరిచిన నువ్వూ నీ గ్యాంగూ శాడిస్టులే... గొప్ప సేవా భావంతో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్లని, ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆంబోతుల్లా పడుతున్నారని, ఇళ్లలో చొరబడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని, సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు, నీ గ్యాంగు అంతా శాడిస్టులు కాకపోతే మరి ఎవరయ్యా? అని అడుగుతున్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. చెల్లెమ్మ గీతాంజలిని వేధించి ప్రాణం తీసిన శాడిస్టులు... మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు.. నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీనవర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక పాపం.. తాను చెప్పిందని, సోషల్ మీడియాలో అది వచ్చిందని, ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి, వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా చంద్రబాబూ అని అడుగుతున్నాను. 14 ఏళ్లు సీఎం- ఒక్క మంచీ చేయని వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తి, ఇంతటి దారుణమైన వ్యక్తి 14 ఏళ్లు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా? అని అడుగుతున్నాను? చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా? అని అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి గానీ, ఒక్కటంటే ఒక్క స్కీము గానీ పేదలకు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి. మరోవంక మీ బిడ్డ ఉన్నాడు. గ్రామ గ్రామానికీ, నగరానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికీ, ఇంటింటికీ, మనిషి మనిషికీ, అన్ని సామాజిక వర్గాలకూ, రైతన్నలకు వృత్తి వర్గాలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికీ చూపించి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం. ఇంత డబ్బు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ నేరుగా పంపించాడు. మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెబుతారు. ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కల్పిస్తారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుట్టలో వేసిన సంస్కృతిని మార్చి.. ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భావించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తున్నాం సిద్ధం.. సిద్ధం అని చెప్పి. ఈ 58 నెలల్లో మీరిచ్చిన అధికారంతో దేవుడి ఆశీస్సులతో గ్రామ గ్రామాన, ఇంటింటా జగన్ మార్కు ఏమిటో 4 మాటల్లోనే గుర్తు చేస్తాను. ఇంటింటా జగన్ మార్కు నాలుగు మాటల్లో... ఇది మన 58 నెలల మన ప్రోగ్రెస్ రిపోర్టు ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రిపోర్టు. ఇది మనం తీసుకొచ్చిన విప్లవాల రిపోర్టు. ఇది ఎక్కడ చూసినా కూడా మీ కళ్ల ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు. గ్రామ గ్రామాన గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గ్రామ, వార్డు సచివాలయాలంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ అంటే, ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్, మీ బిడ్డ. అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ జగన్, మీ బిడ్డ. ఇంటింటికీ వాలంటీర్ సేవలంటే మీ జగన్, మీ బిడ్డ. అవునా? కాదా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా– రైతులకు అండగా.. గతంలో ఎప్పుడూ ఇవ్వని విధంగా, చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి అండగా రైతు భరోసా అంటే మీ జగన్, మీ బిడ్డ. పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంటు, సమయానికే ఇన్ పుట్ సబ్సిడీ, రైతన్నలకు సున్నా వడ్డీకే రుణాలు, రైతులకు ఉచిత పంట బీమా ఇవన్నీ అంటే మీ జగన్, మీ బిడ్డ. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే కూడా మీ జగన్, మీ బిడ్డ. సహకార రంగాన్ని మారుస్తూ అమూల్ ను సహకార రంగంలోకి తీసుకొచ్చి పోటీ పెంచి పాడి రైతులకు ధరలు పెంచింది ఎవరంటే, ఈరోజు పాలకు లీటరు రూ.10 నుంచి రూ.20 ఈ 58 నెలల కాలంలో పెరిగింది అంటే కారణం మీ జగన్, మీ బిడ్డ. 100 సంవత్సరాల తర్వాత భూముల సమగ్ర రీ సర్వే... 100 సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది ఎవరంటే మీ జగన్, మీ బిడ్డ. ఏకంగా 35 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరంటే మీ జగన్, మీ బిడ్డ. మరి ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే, మీ బిడ్డ పాలనలోనే ఈ 58 నెలల్లోనే ఉంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా? అసూయతో, కుళ్లుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉందంటే 20 జెలసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో, ఆయన కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఆయన అంతగా కడుపు మంటతో బాధపడుతున్నాడు కాబట్టి ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ, మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు గురించి. మన ప్రొగ్రెస్ రిపోర్ట్ మరింత వివరంగా... నాడు నేడుతో ఇంగ్లీషు మీడియంతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే మీ జగన్, మీ బిడ్డ. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి ఆ అక్కచెల్లెమ్మలకు అందుతోందంటే మీ జగన్, మీ బిడ్డ. పెద్ద చదువుల కోసం ఏ తల్లీతండ్రీ అప్పులపాలు కాకూడదని, ఆ పిల్లలకు, అక్కలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన అంటే మీ జగన్, మీ బిడ్డ. విద్యా కానుక అంటే మీ జగన్, పిల్లలకు గోరు ముద్ద అంటే మీ బిడ్డ. ఇంగ్లీషు మీడియంతో మొదలు.. బైలింగ్వల్ టెక్ట్స్‌బుక్స్, మన గవర్నమెంట్ స్కూలు పిల్లల చేతుల్లో ట్యాబులు, మన పిల్లలు వెళ్లే గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధనకు ఊతమిస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాసులో ఐఎఫ్‌పీ ఫ్యానెల్స్‌తో కనిపిస్తున్న క్లాసు రూములు అంటే కారణం మీ బిడ్డ, మీ జగన్. పేదలు అప్పులు పాలవ్వకూడదని.... పేదలెవరూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ జగన్, మీ బిడ్డ. ఆరోగ్యశ్రీయే కాదు.. రెస్ట్ పీరియడ్ లో కూడా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఆరోగ్య ఆసరా అందుతోందంటే మీ జగన్, మీ బిడ్డ. ప్రభుత్వ ఆస్పత్రులు ఈరోజు రూపు మారాయంటే కారణం మీ జగన్, మీ బిడ్డ. ఏకంగా 54 వేల కొత్త పోస్టులు వైద్య రంగంలో ఈరోజు భర్తీ అయ్యాయంటే, కొత్తగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే కారణం మీ జగన్, మీ బిడ్డ. అక్కచెల్లెమ్మల సాధికారతకు పెద్దపీట వేస్తూ చేయిపట్టుకుని నడిపిస్తూ చేయూత ఇస్తున్నాడంటే మీ జగన్, మీ బిడ్డ. అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అంటే మీ జగన్, మీ బిడ్డ. కాపు నేస్తం అంటే మీ జగన్, మీ బిడ్డ. అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు అంటే అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామంటే మీ జగన్, మీ బిడ్డ. అక్కచెల్లెమ్మలకు ఆసరా అన్నా మీ బిడ్డే, అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ అన్నా మీ జగన్, మీ బిడ్డే. అక్కచెల్లెమ్మల భద్రతలో సైతం... ఈరోజు గ్రామాల్లో అక్కచెల్లెమ్మల భద్రత కోసం అదే గ్రామంలో మహిళా పోలీస్ ఉంది అంటే మీ జగన్, మీ బిడ్డ. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ ఉండి ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉందంటే మీ జగన్, మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం అంటే మీ జగన్, మత్స్యకార భరోసా అంటే మీ జగన్, వాహన మిత్ర అంటే మీ జగన్, చేదోడు, తోడు అంటే మీ జగన్, లా నేస్తం అంటే మీ జగన్. మొట్ట మొదటి సారిగా అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ ఏకంగాచట్టం చేసి మరీ 50 శాతం రిజర్వేషన్లు అక్కచెల్లెమ్మలకే ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో గానీ నామినేటెడ్ కాంట్రాక్టుల్లో గానీ అక్కచెల్లెమ్మలకు రాజకీయ సాధికారత దక్కింది ఎప్పుడంటే మీ జగన్, బిడ్డే. ఆలోచన చేయమని అడుగుతున్నాను. సామాజిక న్యాయం తీసుకున్నా ఇదే మాదిరిగా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ 2.31 లక్షల గవర్నమెంట్ జాబులు ఈ 58 నెలల కాలంలోనే మనం భర్తీ చేస్తే, అందులో ఏకంగా 80 శాతం పోస్టులు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లు, నా.. నా.. నా.. నా.. అని నేను పిలుచుకుంటున్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలే కనిపిస్తున్నారంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈరోజు నామినేటెడ్ పనుల్లో, నామినేటెడ్ పదవుల్లోనే కాక ఏకంగా 2.70 లక్షల కోట్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ములో ఏకంగా 75 శాతం పైచిలుకు సొమ్ము నేను నా.. నా... అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీల అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా వెళ్తున్న పరిస్థితి ఉందంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించాం. ఎప్పుడూ జరగనట్టుగా ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు, ఇంగ్లీషు మీడియం బడులు కనిపిస్తున్నాయి. కొత్తగా సీ పోర్టులు– ఎయిర్‌పోర్టులు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీ పోర్టులు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ఎయిర్ పోర్టుల విస్తరణ తీసుకున్నా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వాయువేగంతో కట్టడం మొదలు పెట్టిన కార్యక్రమం అయినాగానీ, ఏది తీసుకున్నా కూడా 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడుతున్నాను. మేనిఫెస్టోలో నూటికి 99 శాతం హామీలను నెరవేర్చిన పరిస్థితి ఉందంటే అది మీ బిడ్డ మీ జగన్ వచ్చిన తర్వాతనే మొట్ట మొదటి సారిగా జరుగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇవన్నీ.. నేను చెప్పినవన్నీ కూడా ఏవీ అవాస్తవాలు కాదు. ఇవన్నీ మన కళ్ల ఎదుటే మన గ్రామంలోనే ఇవన్నీ కూడా కనిపిస్తున్న సత్యాలు అనికూడా ఈ సందర్భంగా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను. ప్రజా జీవితంలో అధికారాన్ని ఇంటింటికీ మేలు కోసం ప్రతి ఒక్కరికీ మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడం కోసం ఆయన ఉపయోగించాడు. తేడా, వ్యత్యాసం గమనించమని కోరుతున్నాను. కారణం ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి కేవలం మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. మన జెండా తలెత్తుకుంటే– వారి జెండా జత కడుతోంది. కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ బిడ్డ, నేను ఇంత నిజాయితీగా, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు చరిత్ర ఏమిటి? ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు? ఏం చేశారు? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? 2014కు వెళ్దామా? 5 ఏళ్లే కాబట్టి బాగా గుర్తుంటుంది అందిరకీ. 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుగారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే. 2014లో కనిపిస్తున్నాయా ఫొటోలు? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖారవిందం, పక్కనే దత్తపుత్రుడు, ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. వీళ్ల ముగ్గురి ఫొటోలతో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు. ముఖ్యమైన హామీలంటే ఈ పాంప్లెట్ చంద్రబాబు ప్రతి ఇంటికీ పంపించాడు. అప్పట్లో ఆ ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో ఊదరగొట్టాడు అడ్వటైజ్ మెంట్లన్నీ కూడా. గుర్తున్నాయా? అందరికీ గుర్తున్నాయా? ఒక్కసారి ప్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే.... మరి ముఖ్యమైన హామీలు నేను ఒక్కసారి చదువుతాను. జరిగాయా? లేదా? మీరే చెప్పండి. రైతుల రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్ల రుణ మాఫీ.. చేశాడా? ఇంకా ముందుకు పోదామా ఆయన ముఖ్యమైన హామీలు. చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా చేశాడా? అక్కా.. ఒక్క రూపాయి అయినా చేశాడా? మూడో ముఖ్యమైన హామీ.. ఆడబిడ్డపుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నాడు. రూ.25 వేలు కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? నాలుగో ముఖ్యమైన హామీ.. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే నెలనెలా రూ.2 వేలు నిరుద్యోగభతి ఇస్తామన్నాడు. 60 నెలల్లో రూ.2వేల చొప్పున అంటే రూ.1.20 లక్షలు.. మీ ఇంటికి వచ్చిందా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. 3 సెంట్ల స్థలం కథ దేవుడెరుగు.. ఒక్క సెంటు స్థలమైనా, కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ.. అయ్యాయా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు.. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ పొదిలిలో ఏమన్నా హైటెక్ సిటీ కనిపిస్తోందా? పోనీలేబ్బా మార్కాపురంలో అన్నా కనిపిస్తోందా? అక్కడ కూడా కనిపించడం లేదా? పోనీ ఒంగోలులో కనిపిస్తోందా? అక్కడ కూడా కనిపించడం లేదా? ఇదీ.. 2014లో ఇదే కూటమి.. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీగారిఫొటోతో చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ ఈ మాదిరిగా చంద్రబాబు ఇంటింటికీ పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా? అని అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అదీ లేదు. మరి ఇవాళ ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే ముగ్గరితో జతకట్టి, ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ రంగు రంగుల హామీలంటూ ఇంటింటికీ బెంజ్ కారంటూ, ఇంటింటికీ కేజీ బంగారం అంటూ సూపర్ సిక్స్ అంటున్నాడు, సూపర్ సెవెన్ అంటున్నాడు. నమ్ముతారా? చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోమని కోరుతూ ఇలాంటి మోసాలు చేసే వాళ్లను, వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను, మన పేదలను, మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే, మీ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. అందులో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. గట్టిగా సిద్ధమే అని గట్టిగా నినదించండి. డబుల్ సెంచరీ కొడదాం... ఈసారి ఎన్నికల్లో మోసం చేసే ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెబుతూ 175కు 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు మొత్తం 200కు 200 డబుల్ సెంచరీ కొట్టేందుకు సిద్ధమేనా? దేవుడి దయతో మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మరో రెండు నెలల్లో మీ బిడ్డ మళ్లీ జగన్ అనే నేను... మళ్లీ మీ దగ్గరికి ఇంతకన్నా గొప్ప విజయంతో,దేవుడి ఆశీస్సులతో ఇంతకన్నా గొప్పగా మీ అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం దేవుడు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. మన పార్టీ అభ్యర్ధులను దీవించండి. మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ముందు ఒక్కసారి మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మొట్ట మొదటగా మీ అందరికీ మన పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరికీ భాస్కర్ ను పరిచయం చేస్తున్నాను. నాను అత్యంత సన్నిహితుడు. మీ పార్లమెంటుకు, ప్రజలకు మంచి చేస్తాడు. మనసు నిండా పేదలపై, ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు భాస్కర్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్నా రాంబాబు అన్నకు టికెట్ ఇస్తున్నాం. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నారు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ కచ్చితంగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఒంగోలు నుంచి వాసన్నను అభ్యర్థిగా నిలబెడుతున్నాం. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు.. ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతాడు. అంత మంచోడు, పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వాసన్నపై ఉంచాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. ఎర్రగొండపాలెం నుంచి చంద్రను నిలబెడుతున్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు చంద్రపై ఉంచాల్సిందిగా చంద్రపై ఉంచాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. దర్శి నుంచి నా తమ్ముడు శివకు టికెట్ ఇస్తున్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. కనిగిరి నుంచి మీలో ఒకడు, అతి సామాన్యుడు నారాయణ యాదవ్. మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. కొండెపి నుంచి సురేష్ నిలబడుతున్నాడు. నాకు తమ్ముడు లాంటి వాడు. మంచివాడు, ఐఆర్‌ఎస్ చదివాడు, సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తున్నవాడు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సురేష్ పై ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గిద్దలూరు నుంచి నాగార్జున నిలబడుతున్నాడు. నా తమ్ముడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు తనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. మన గుర్తు ఫ్యాన్- గుర్తుపెట్టుకొండి. మన గుర్తు అక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయి ఉన్నా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను. అక్కా అక్కడ.. అవ్వా అక్కడ.. అవ్వా మన గుర్తు ఫ్యాన్. ఇక్కడున్న అవ్వా.. కళ్ల జోడు పెట్టుకున్న అవ్వా ఇక్కడ ఫ్యాను, మన గుర్తు అవ్వా. మన గుర్తు ఫ్యాను. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి అటు వచ్చి మీ అందరికీ కనపడి మళ్లీ వెళ్తాను. అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.