గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దంప‌తులు 

విజయవాడ: గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంప‌తుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైయ‌స్ భార‌తి దంప‌తులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌ను క‌లిసిన సీఎం దంప‌తులు వారికి పుష్ప‌గుచ్ఛం, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. అనంత‌రం గవర్నర్, సీఎంల మధ్య దాదాపు గంటకు పైగా చ‌ర్చ జ‌రిగింది. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తుల‌ను గ‌వ‌ర్న‌ర్ శాలువాతో స‌త్క‌రించి జ్ఙాపిక‌ను అంద‌జేశారు. 

తాజా వీడియోలు

Back to Top