కార్మిక సంఘాలతో ముగిసిన సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

స్టీల్‌ ప్లాంట్‌ను సీఎం కాపాడతారనే విశ్వాసం ఉంది: కార్మిక సంఘాలు

విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు గంటపాటు 14 కార్మిక సంఘాలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసినట్లు సీఎం చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కేంద్రానికి సూచనలు చేసినట్లుగా సీఎం వివరించారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చెప్పినట్లుగా కార్మిక సంఘాల నేతలు వివరించారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగబోదని సీఎం మాటిచ్చారని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాటపై తమకు నమ్మకం ఉందని కార్మిక సంఘాల నేతలు చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ను సీఎం కాపాడతారనే విశ్వాసం తమకు ఉందని,  ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల‌ని సీఎంకు కార్మిక సంఘాల నేత‌లు విన‌తిప‌త్రం అంద‌జేశారు. కార్మిక సంఘాల నేత‌ల‌తో భేటీలో మంత్రులు క‌న్న‌బాబు, అవంతి శ్రీ‌నివాస్‌, ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, స‌త్య‌వ‌తి, ఎమ్మెల్యేలు, ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు.

 

Back to Top