కాసేప‌ట్లో క‌ర్నూలుకు బ‌య‌ల్దేర‌నున్న సీఎం

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేప‌ట్లో కర్నూలు బ‌య‌ల్దేర‌నున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి వివాహానికి హాజరుకానున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొని 12.15 గంటలకు తాడేప‌ల్లికి బయలుదేరుతారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top