వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో నూతనంగా రూ. 26.12కోట్లతో నిర్మించిన వైయస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండవ హాకీ టర్ఫ్ కోర్టును సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ అకాడమీలో హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు,ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టులు ఉన్నాయి. అలాగే పులివెందులలో ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.