ఆర్థిక సహాయం

పుట్టపర్తి నుంచి తిరుగు ప్రయాణంలో వినతులు స్వీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

పలువురు బాధితులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేత

సత్వరమే ప్రభుత్వం తరపున సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి

5,50,000 రూపాయలు వివిధ చెక్కులను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదుగా  వివిధ జబ్బులతో బాధపడుతున్న వారికి మందుల అవసరాలు కొనుగోలు నిమిత్తం, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేశారు

పుట్టపర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీన మంగళవారం పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి   జిల్లాలోని పుట్టపర్తి పర్యటనలో భాగంగా విమానాశ్రయం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు.

వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుకు  ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్ మోహన్ రెడ్డి.

సీఎం ఆదేశాల మేరకు బాధితులకు సహాయం అందించిన జిల్లా కలెక్టర్‌..

 

1. కాకి శ్రీనివాసులు ధర్మవరంలో నివాసం ఉన్నాను. దొడ్డ బల్లాపూర్. రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి నాకు రెండు కాళ్లు ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి ఉన్నాను. ముఖ్యమంత్రికి  ఈరోజు  వినతి సమర్పించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఒక లక్ష రూపాయలు చెక్కును బాధితునికి పంపిణీ చేశారు.

 

2. నార్పులాకు చెందిన పెద్దక్క కుమారుడు అశోక్ బుద్ధి మాధ్యంతో బాధపడుతూ ఉన్నాడు మెడికల్ ఖర్చులు అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు .పెద్దక్క 50వేల రూపాయల ఆర్థిక సహాయం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు.

 

3. పి రజిని గుట్టూరు విలేజ్ పెనుగొండ మండలం, డయాలసిస్తో బాధపడుతూ ఉన్నది ముఖ్యమంత్రికి ఈరోజు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వినతి పత్రాలు సమర్పించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ 50వేల రూపాయలు చెక్కును పంపిణీ చేశారు.

 

4. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎం వెంకట భాస్కర్ రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. మెడికల్ ఖర్చులు కొరకు ఆర్థిక సహాయం కొరకు ముఖ్యమంత్రికి వినతుల సమర్పించారు. కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు లక్ష రూపాయలు చెక్కును పంపిణీ చేశారు.

 

5. జి అశ్విని, ఎర్ర గుంట గ్రామం రాప్తాడు నందు నివాసం ఉన్నారు క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నది ఆర్థిక సహాయం కొరకు ముఖ్యమంత్రికి ఈరోజు వినతి పత్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

6. ఎన్ రాజేశ్వరి పాడిపేట వెస్ట్ గోదావరి జిల్లా కిడ్నీ తో బాధపడుతూ ఉన్నానని ఆర్థిక సహాయం అందించవలసిందిగా ముఖ్యమంత్రికి వినతుల అందజేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు 50వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

7. విజయలక్ష్మి భర్త నరాల వ్యాధితో బాధపడుతూ ఉన్నాడని ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా ముఖ్యమంత్రికి ఈరోజు వినతులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పి ఆర్ అండ్ బాబు లక్ష రూపాయలు చెక్కును పంపిణీ చేశారు.

స్థానిక కలెక్టరేట్లోనే స్పందన సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డిఆర్ఓ కొండయ్య, జిల్లా వైద్యశాఖ అధికారి ఎస్ వి కృష్ణారెడ్డి, డి సి హెచ్ ఓ తిప్పే నాయక్, కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.

Back to Top