సీఎం అనే విష‌యాన్ని మ‌ర‌చిపోయి..టీచ‌ర్ల‌తో మ‌మేకం

గురుపూజోత్సవంలో నిరాడంబ‌రంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
  
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌

విజ‌య‌వాడ‌:  ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు పెద్దలు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. తాను ముఖ్య‌మంత్రి అన్న విష‌యాన్ని మ‌ర‌చిపోతారు. ఎక్క‌డికి వెళ్తే అక్క‌డి వారితో మ‌మేకం అవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. విద్యార్ధుల వ‌ద్ద‌కు వెళ్లినా..ఉపాధ్యాయుల వ‌ద్ద‌కు వెళ్లినా వారితో కలిసిపోతారు. ప్ర‌తి ఒక్క‌రిని గౌర‌వంగా చూడటం ఆయ‌న నైజం. భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం ఘ‌నంగా గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు హాజరయ్యారు.  డాక్టర్‌ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.  ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సీఎం శ్రీ వైయస్‌ జగన్ స‌న్మానించారు.  పురస్కారం అందుకునే క్రమంలో కింద పడ్డాయి ఒక ఉపాధ్యాయుడి కళ్ళద్దాలు. అది గమనించిన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్.. వెంటనే తానే కిందకు వంగి కళ్ళద్దాలు తీసి ఇచ్చారు. కళ్ళద్దాలను ఉపాధ్యాయుడి జేబులో పెట్టి తర్వాత పురస్కారం అందజేశారు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్. మ‌రో ఉపాధ్యాయుడు వీల్ చైర్‌పై పుర‌స్కారం అందుకునేందుకు రాగా..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆ ఉపాధ్యాయుడిని స‌త్క‌రించి కింద కూర్చొని ప్ర‌శంస ప‌త్రం అంద‌జేశారు. అంత‌కుముందు సీఎం ఎదుట ఉన్న టేబుల్‌ను స‌రిచేసేందుకు ఓ అధికారి రాగా..అక్క‌డే ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ వారితో క‌లిసి టేబుల్ ఎత్తి ప‌క్క‌న పెట్టారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌భ‌లో నిరాడంబ‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

తాజా వీడియోలు

Back to Top