మ‌చ్చ‌లేని నాయ‌కుడు పెనుమ‌త్స‌

పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజు మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేపల్లి: రాజకీయ కురువృద్ధులు, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెనుమ‌త్స‌ సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకులు పెనుమ‌త్స సాంబశివరాజు అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొనియాడారు. పెనుమ‌త్స‌ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజా వీడియోలు

Back to Top