విమాన టికెట్ల‌తో స‌హా అన్నిఏర్పాట్లు చేయండి

ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: ఉక్రెయిన్ నుంచి స్వ‌దేశానికి వచ్చే ఏపీ విద్యార్థులకు విమాన టికెట్లు స‌హా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకునే విద్యార్థులను అక్కడి నుంచి వారి సొంత ప్రాంతాల‌కు చేర్చేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. అందుకు తగినట్లు ఏపీ భవన్‌ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Back to Top