నేడు ఢిల్లీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.30 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి రోడ్డు మార్గంలో గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు బ‌య‌ల్దేరుతారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరి సాయంత్రం 7.15 గంట‌ల‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి జ‌న్‌ప‌థ్‌-1లోని త‌న అధికారిక నివాసానికి చేరుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్రమంత్రుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ కానున్న‌ట్టు స‌మాచారం.

Back to Top