ఎస్పీ నయీంకు సీఎం అభినందనలు

అమరావతి: కిడ్నాప్‌ అయిన జషిత్‌ను క్షేమంగా రక్షించిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీం, ఇతర సిబ్బందిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్‌ అయిన జషిత్‌ను పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చడంతో ఆ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు. అనపర్తి మండలం తుకులూరులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలిపెట్టగా , బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top