తాడేపల్లి: ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించిన జ్యోతి యర్రాజీని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి మరో అద్భుతమైన ఘట్టమని, ఆసియా క్రీడల్లో రజతం సాధించిన జ్యోతి ఆంధ్రప్రదేశ్‌ను, భారతదేశాన్ని గర్వంచేలా చేసిందన్నారు. అద్భుతమైన విజయాన్ని సాధించిన జ్యోతి యర్రాజీకి సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు.