పోలవరంపై తొలిసారిగా రివర్స్‌ టెండరింగ్‌

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

గత ప్రభుత్వం సబ్‌కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చినవారికి కాంట్రాక్టులు

2021 నాటికి పోలవరం నీళ్లు ఇవ్వాలన్నదే లక్ష్యం

టీడీపీ చేసిన స్కామ్‌లన్నీ బయటకు వస్తాయి

అమరావతి: తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుపై రివర్స్‌ టెండరింగ్‌ పిలుస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 2021 వరకు నీళ్లు ఇవ్వాలనే మా లక్ష్యమని ఆయన తెలిపారు. మూడు రోజులుగా ఇరిగేషన్‌ మంత్రి వివరణ ఇస్తునే ఉన్నారని టీడీపీ సభ్యులు ఎందకంత రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మరోసారి పోలవరంపై క్లారిటీ ఇచ్చారు. సీఎం మాట్లాడుతూ.. పోలవరంపై తొలిసారిగా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని స్పష్టం చేశారు.

సబ్‌కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బంధువు సబ్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. రూ.724 కోట్ల నిధులు అడ్వాన్స్‌ మొబలైజేషన్‌ ఫండ్స్‌గా ఇచ్చారు. నవయుగ కంపెనీకి ఏ పనులు కాకుండానే మొబలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చారని తెలిపారు. నామినేషన్‌ పద్ధతిలో ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చారు. పోలవరంపై గత ప్రభుత్వ హయాంలో దారుణమైన స్కామ్‌లు జరిగాయని విమర్శించారు.టీడీపీ చేసిన స్కామ్‌లన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు పోలవరంపై ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అన్ని ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు సభను స్వార్థం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా వివరణ ఇస్తున్నా రాద్దాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Back to Top