రామాయ‌ప‌ట్నం పోర్టుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భూమిపూజ‌

పోర్టు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించిన ముఖ్య‌మంత్రి

నెల్లూరు: రామాయ‌ప‌ట్నం పోర్టు పనులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ప్రారంభించారు. రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి నుంచి నెల్లూరు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్‌ పనుల్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంత‌రం ఫొటో గ్యాల‌రీని ప‌రిశీలించారు. 

Back to Top