మంచి పనులు ఆలస్యం కాకూడదనే మండలి రద్దు

 ఎవరి కుట్రలకో ప్రజా ప్రయోజనాలు బలికావడం నాకిష్టం లేదు

 శాసనసభకే సర్వాధికారులున్నాయని ఆర్టికల్ 164లో స్పష్టంగా ఉంది

  ప్రభుత్వాలు సజావుగా పనిచేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పదు 

  ప్రజా అవసరాలకు ఆటంకంగా మారిన మండలిని కొనసాగించడం వృథా 

   ది టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ.. వాట్ ఈజ్ రైట్

    అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

అసెంబ్లీ: శాసనమండలి భవిష్యత్తుకు సంబంధించిం సమావేశం జరుగుతున్న విషయం రాష్గ్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి మండలిని బ్రతికించువాలో వద్దో నిర్ణయించాల్సిన అవసరం మనందరి మీదా ఉంది. ప్రజా ప్రభుత్వాలు సజావుగా పనిచేయాలా వద్దా అనేది కూడా సమాధానం వెతకాల్సి ఉంది. 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164-2 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి. రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ మండలి తప్పనిసరి అనుకుని ఉంటే.. ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి అనువుగాని విధంగా మండలి నిబంధనలు తయారు చేసి ఉండేది. అలా కాకుండా ఆఫ్షనల్గా ఉంచుతూ రద్దు నిర్ణయాన్ని అసెంబ్లీకి ఇచ్చింది. దేశంలో చదవుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో మండలి ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ఆ రోజుల్లో కల్పించారు. కానీ ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నా.
 
శాసనసభలో విద్యావంతులు దండిగా ఉన్నారు
మన సభలో ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా ముగ్గురు పీహెచ్డీ చేసిన వారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజినీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 38 మంది, టీచర్లు ఇద్దరు, జర్నలిస్టులు ఒకరు, ప్రొఫెసర్లు ఒకరు, సివిల్ సర్వీస్ నుంచి వచ్చిన వారు ౩, గ్రాడ్యుయేట్లు 60 మంది ఉన్నారు. ఇలాంటప్పుడు మండలి అవసరం ఏముంది..

ఇప్పుడు మండలి దేశంలో 28 రాష్ట్రాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే ఉంది. (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర) ఉంది. మండలి వ్యవస్థ వద్దని పశ్చిమబెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. 

మండలికి శాసనసభ జవాబుదారీ కాదు..
రాష్ట్ర కేబినెట్ శాసనసభకే తప్ప మండలికి జవాబుదారీ కాదనేది వాస్తవం. శాసనసభ చేసిన బిల్లు మండలికి లేదనేది చట్టం చెబుతోంది. మండలి చేసిన సవరణలు తప్పక పాటించాలన్న నిబంధన కూడా లేని పరిస్థితుల్లో శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కానీ రాజకీయ దురుద్దేశ్యంతో శాసనసభ చేసిన తీర్మానాలను అడ్డుకునే ప్రయత్నం చేయాలనుకోవడం రాష్ట్ర ప్రయోజనాలను కాలరాయడమే. దీనివలన కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ప్రజా ప్రయోజనాలు లేని మండలిపై డబ్బును ఖర్చు చేయడం శుద్ధ దండగ. మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు చేయడం కూడా అనవసరమే. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం బిల్లు తెచ్చినా, ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించే బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేలా వ్యవహరిస్తున్న మండలి కారణంగా ప్రజా ప్రయోజనాలు ఆలస్యం అవుతున్నాయి. 

ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు ఈనాడు సమర్థించలేదా..
గతంలో 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు టీడీపీ పాంప్లేట్ పత్రిక ఈనాడులో సీఎం నిర్టణయాన్ని సమర్థిస్తూ ఎడిటోరియల్ రాసింది. కథనం పరిశీలిస్తే.. అనుభవంలో వాటి నిష్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురద కడుక్కున్నాయి. అందుకు పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్టేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు అపాదించి రభస చేయనవసరం లేదు. 
నిరర్ధకమే కాక, గుదిబండలా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 
ప్రజలు అకండమైన మెజారిటీతో గెలిపించిన ప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది. రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గాల్లో విజయంగా మార్చుకోవడానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకయినా మంచి పేరు తీసుకురావలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదార్లు తొక్కితే మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. 

ఈనాడు కోసమే మండలి రద్దు జరిగింది…
ఆరోజుల్లో మండలిని కేవలం ఈనాడు కోసమే రద్దు చేశారు. ఈరోజు కోట్ల మంది ప్రజా ప్రయోజనాలకు అడ్డుతగులున్న, ఆర్థికభారమైన మండలిని రద్దు చేయడాన్ని గర్వంగా చెబుతున్నాము. ఇలాగే మండలిని కొనసాగిస్తే ఏడాదిలోనే మా పార్టీకి మెజారిటీ వస్తుందని తెలిసినా, రాజకీయంగా అవసరాలు నెరవేర్చని తెలిసినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మండలి రద్దువైపు మొగ్గు చూపాం. 
ఆపరేషన్ ఆకర్ష్ అంటూ టీడీపీ భజన పత్రికలు రోత రాతలు రాస్తుంటే బాధేస్తుంది. చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తుంటే నోరు మెదపలేదు. తెలంగాణలో ఇదే చంద్రబాబు ఎమ్మెల్సీ కొనుగోలు కోసం ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికినప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నోరు మెదపలేదు. మా పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినప్పుడు ఈ ఎల్లో మీడియాలో స్పందనలేకపోగా.. చంద్రబాబు రాజనీతజ్ఞుడిగా ప్రచారం చేయడానికి వెనకాడేలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కడప, కర్నూలు, నెల్లూరులో మాకు బలమున్నా అతి నీచంగా కొనుగోలు చేసి గెలిచారు. అప్పుడూ ఈ ఎల్లో మీడియా చంద్రబాబును మాటమాత్రమైనా ప్రశ్నించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసే అవకాశం ఉన్నా.. అలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు నేను పూర్తిగా భిన్నం. ఇదే విషయాన్ని తొలిరోజు సభలోనే చెప్పాను. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాజకీయాలను మార్చడానికి సభలో అడుగుపెట్టామే తప్ప.. రాజకీయాలు చేయడానికి కాదు. 

చర్చ జరగాలనే మూడు రోజులు సమయమిచ్చాం 
మండలి రద్దు గురించే సభ పెడుతున్నామని గురువారం నాడే చెప్పాం. అయినా టీడీపీ భజన పత్రికల్లో కోనుగోలు చేస్తున్నామని ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలు చర్చించుకోవాలని సమయమిచ్చినా ఎమ్మెల్సీలను రూ. 5 కోట్లకు కొంటున్నామని విష ప్రచారం చేస్తున్నారు. విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరో, అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే నైజం ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 
ప్రత్యేక హోదా విషయంలో, మోడీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో, మండలి విషయంలో.. ఎన్నెన్ని యూ టర్న్లు తీసుకున్నాడో గడిచిన అయిదేళ్లలోనే చాలా చూశాం. అవసరం కోసం ఏ మాటైనా మాట్లాడగలడు.. అవసరం తీరాక కూతుర్నిచ్చిన మామను సైతం వెన్నపోటు పొడవడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు. అన్యాయం జరుగుతోంది.. అన్యాయం జరుగుతోంది.. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు బాబు వాడే స్టాండర్డ్ డైలాగ్ ఇది. 

చంద్రబాబూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. 

  •  ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది. వారి క్షేమాన్ని కాంక్షించి ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లు తీసుకొచ్చాం. దీన్ని అడ్డుకోవడం చంద్రబాబు చేసిన తప్పకాదా.
  •    రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులు తీసుకుకావడం తప్పా
  •    ఏ అన్యాయం జరిగిందని అమరావతి రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నాడు. రైతులకు కౌలు పెంచడం న్యాయం చేయడమా, అన్యాయం చేయడం తప్పా. 
  •    అసైన్డు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ప్లాట్లు ఇవ్వడం మా చేసిన తప్పా. చంద్రబాబు చేసిన తప్పులను రిపేర్ చేయడం కూడా తప్పా.
  •    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ది ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగితే నేరమా.
  •     వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అబివృద్ధి చేసే సంకల్పంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలనుకోవడం నేరమా. 
  •     స్వాతంత్ర్యాని కి పూర్వం 1937 నాటి  శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా.  
  •     చంద్రబాబులా బాహుబలి లాంటి గ్రాఫిక్సు సినిమాలు చూపించకుండా మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆశ పడితే అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గం. ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం జరగకూడదు. ఎవరి కుట్రలకు మంచి పనులు ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకే మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిని ప్రజలందరూ అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. 
  • ది టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ.. వాట్ ఈజ్ రైట్ అని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకోవాలి.

తాజా వీడియోలు

Back to Top