చంద్ర‌బాబుకు ఉలిక్కిపాటు ఎందుకు 

- అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

 జీవో 2430 రద్దు చేయ‌మ‌ని టీడీపీ నాయ‌కులు డిమాండ్ చేయడం చూస్తుంటే ఆశ్చ‌ర్యంగా ఉంది. అస‌లు చంద్ర‌బాబు ఈ జీవో చ‌దివి ఉండ‌క‌పోవ‌చ్చు లేదా చ‌దివినా అర్థంక అయ్యుండ‌కోవ‌చ్చు. ప్రింట్అ, ఎల‌క్ట్రానిక్, సోషల్ మీడియాలో అస‌త్య‌ ఆరోప‌ణ‌లు ప్ర‌చారం చేయ‌డం కానీ, ప్రింట్ చేయ‌డం కానీ, ప్ర‌సారం చేయ‌డం కానీ చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామని జీవోలో స్ప‌ష్టంగా పేర్కొన‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వ  లేదా ఆయా శాఖ‌ల గౌర‌వాన్ని ప‌డిపోయేలా అస‌త్య ప్ర‌చారం చేస్తే సంబంధిత వ్య‌క్త‌లపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జీవో ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి గౌర‌వాన్ని దిగ‌జార్చేలా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో అస‌త్య క‌థ‌నాలు రాస్తే చూస్తూ ఊరుకోవాలా. ముఖ్య‌మంత్రికి ఆ క‌నీస గౌరవం ఉంటుంద‌ని న‌ల‌భై ఏళ్ల అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబుకు తెలియ‌క‌పోతే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. 
 

Back to Top