ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారి నియామ‌కం

వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలి

క్యాన్సర్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి 

వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లోకి 12 రకాల రాపిడ్‌ డయాగ్నోస్టిక్స్‌ కిట్లు

 అమరావతి: ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష వివ‌రాలు ఇలా..

పటిష్టంగా ఆరోగ్య శ్రీ సేవలను రోగులకు అందించేందుకు గతంలో ఆదేశాలు ఇచ్చిన సీఎం. 
–సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.

– ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ అకౌంట్లు క్రియేట్‌ చేశామన్న అధికారులు
– ఈ అకౌంట్ల ద్వారా ఆరోగ్య శ్రీ డబ్బు నేరుగా ఆస్పత్రులకు వెళ్తుందన్న అధికారులు.
– డబ్బులు డిడక్ట్‌ అవగానే ఎస్‌ఎంఎస్‌ కూడా పేషెంట్‌ సెల్‌ఫోన్‌కు వెళ్తుందన్న అధికారులు.
– రోగులు డిశ్చార్జి అయ్యేటప్పుడు వారికి అందిన వైద్యసేవలపై కన్సెంట్‌ లెటర్‌ కూడా తీసుకుంటున్నామన్న అధికారులు.
– లంచాలు లాంటి ఘటనలు ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఏసీబీ 14400 నంబర్‌కూడా కన్సెంట్‌ లెటర్‌పై పెట్టామన్న అధికారులు.
– పేషెంట్‌ డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఏఎన్‌ఎం పేషెంట్‌ ఇంటికి వెళ్లి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటారన్న అధికారులు.
– డిశ్చార్జి తర్వాత ఆరోగ్య పరిస్థితులపై ఏఎన్‌ఎం ఆరా తీస్తారన్న అధికారులు.
– అందిన వైద్య సేవలపై పేషెంట్‌ నుంచి అభిప్రాయాలు తీసుకుంటారన్న అధికారులు.
– ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రల పనితీరుపై కూడా పేషెంట్‌ నుంచి అభిప్రాయాలు తీసుకుంటారని తెలిపిన అధికారులు.
– పేషెంట్‌ ఇంటికి వెళ్లిన  ఏఎన్‌ఎం తగిన విచారణ చేసి తర్వాత సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేస్తారన్న అధికారులు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:
– ఆరోగ్యశ్రీ చికిత్స అనంతరం పేషెంట్‌కి ఇంకా అదనంగా మెడికేషన్‌ అవసరమైన పక్షంలో కూడా సంబంధించి వైద్యాధికారితో ఏఎన్‌ఎం మాట్లాడి, తగిన చికిత్స అందించేలా కూడా చూడాలని సీఎం ఆదేశం. 
– ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశం. 
– ఈ వివరాలను విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ మరియు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్న సీఎం.  విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌లో దీనికి సంబంధించి హోర్డింగ్‌ పెట్టాలన్న సీఎం. 
– 104 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే ఎంప్యానెల్‌ ఆస్పత్రి సమీపంలో ఎక్కడుందో వివరాలు తెలిసే విధానం ఉండాలన్న సీఎం. 

క్యాన్సర్‌ నివారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి:
క్యాన్సర్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం 
 – రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీలతోపాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల్లో కూడా ప్రత్యేక క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటుకు సీఎం ఆదేశం. 
ఇది కేన్సర్‌ కేర్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌కు సెంటర్‌ కావాలన్న సీఎం
– ఇదివరకు ఉన్న కేన్సర్‌ విభాగాలను బలోపేతం చేయడం, లేనివాటిలో సదుపాయాల కల్పన జరగాలని సీఎం ఆదేశం. 
– విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 4 లైనాక్‌ మెషీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.
– శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లో బంకర్ల నిర్మాణానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌. 
– మరో 7 పాత మెడికల్‌ కాలేజీల్లో కేన్సర్‌ శస్త్రచికిత్సలు కోసం ఆపరేషన్‌ ధియేటర్ల అప్‌గ్రడేషన్, పాథాలజీ డిపార్ట్‌మెంట్లలో ఆధునిక సౌకర్యాలు, కీమో థెరపీ, డ్రగ్స్‌ తదితర సదుపాయాలు ఏర్పాటుకు సీఎం ఆమోదం. 

–ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి కూడా ఆ జిల్లాకు సంబంధించిన వైద్యకార్యకలాపాలకు సెంటర్‌గా వ్యవహరించాలి:
విలేజ్‌ క్లినిక్స్‌ దగ్గరనుంచి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఆస్పత్రి కూడా బోధనాసుపత్రి పరిధిలోకి రావాలి: సీఎం
– దీనివల్ల క్యాన్సర్‌లాంటి వ్యాధులను గుర్తించడం, వైద్యం  అందించడం సులభతరమవుతుంది: సీఎం

– వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లోకి 12 రకాల రాపిడ్‌ డయాగ్నోస్టిక్స్‌ కిట్లు. 
– అందుబాటులో 67 రకాల మందులు.
– విలేజ్‌ క్లినిక్స్‌ విధివిధానాల్లో పారిశుద్ధ్యం మరియు తాగునీటి నాణ్యతపై నిరంతర పరిశీలన, నివేదికలు పంపాలి.
ప్రతినెలాకూడా తప్పనిసరిగా నివేదికలు పంపాలి: సీఎం

– ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశం. 
– రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. 
– అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్న సీఎం. 
– రక్తహీనత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనంగా పౌష్టికాహారాన్ని అందించడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్న సీఎం. 
– వైద్యాధికారుల సిఫార్సు మేరకు వైద్యపరంగా, ఆహార పరంగా వారిపై దృష్టిపెట్టాలన్న సీఎం. 
– రాష్ట్రంలో రక్తహీనత కేసులు రాకుండా చూడాలన్న సీఎం. 

– వ్యవసాయానికి ఆర్బీకేలు ఎలా వ్యవహరిస్తున్నాయో ప్రజారోగ్యం విషయంలో కూడా విలేజ్‌క్లీనిక్‌లు కీలక పాత్ర పోషించాలన్న సీఎం. 

– స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ జరగాలన్న సీఎం. 
– పిల్లల ఆరోగ్య పరిస్థితులను కనుక్కోవడంతోపాటు నిరంతరం కంటి పరీక్షలు చేయాలన్న సీఎం. 

– ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులపై వివరాలు అందించిన అధికారులు. 
– సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, సదుపాయాలను మెరుగుపరచాలన్న సీఎం. 
– దీనివల్ల ప్రభుత్వాసుపత్రుల సేవలను మెరుగ్గా వినియోగించుకుంటారన్న సీఎం.
 
కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ పురోగతిని సమీక్షించిన సీఎం.
– దీంతోపాటు ఇప్పుడున్న మెడికల్‌కాలేజీల్లో నాడు – నేడు పనులనూ సమీక్షించిన సీఎం. 
– ఈ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. 
– ప్రతివారం కూడా సమీక్ష చేయాలని సీఎం ఆదేశం. 
– నిర్దేశించుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్న సీఎం. 

ఈ సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి( కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్,  వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్రప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top