సీఎంకు ఆశీర్వచనాలు అందజేసిన టీటీడీ అర్చకులు

తాడేపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ అర్చకులు ఆశీర్వదించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శాలువాతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సత్కరించారు. లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర టీటీడీ క్యాలెండర్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. 

Back to Top