చిత్తూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం నేడు పర్యటించనున్నారు. తిరుపతి, తిరుచానూరులో ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సందర్శించనున్నారు. వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.