ఒడిశా సీఎంతో భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

తాడేప‌ల్లి: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీలో చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. 
నేరడి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా జల వివాదాలు పరిష్కరించుకునేందుకు 9వ తేదీన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. ఈ చర్చలు ఫలవంతమై నేరడి నిర్మితమైతే అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుంది. వంశధార స్టేజ్‌–2, ఫేజ్‌–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్‌ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేయగా, ప నులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉంది. ఈ పనులు చేస్తూనే మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రాజెక్ట్‌ రూపకల్పన చేయగా, తాజా ధరల మేరకు రివైజ్డ్‌ అంచనా వేసి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.  

 

Back to Top