నేడు చీమకుర్తికి సీఎం వైయ‌స్‌ జగన్‌

ప్ర‌కాశం జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ చీమ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు.  ఉదయం గం.9.45ని.లకు తాడేపల్లి నుంచి సీఎం వైయ‌స్‌ జగన్‌ బయల్దేరారు. గం.10.35 ని.లకు చీమకుర్తి చేరుకుంటారు.  10:5 గంట‌లకు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top