తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైయస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.