పూడిమడిక బీచ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆరా

 తాడేప‌ల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
 
పూడిమడక బీచ్‌లో అనకాపల్లి డైట్‌ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్‌, యశ్వంత్‌, సతీష్‌, గణేష్‌, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Back to Top