హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ భూమిపూజ 

తాడేప‌ల్లి: తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భూమిపూజ చేశారు. ఇస్కాన్‌ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్‌ ఇండియా ఆద్వర్యంలో గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తోంది.  ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చెన్నై కోల్‌ కత్తా జాతీయ రహదారి వెంబడి కొలనుకొండ వద్ద నిర్మిస్తున్నారు. ఈ క్షేత్రానికి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొలనుకొండలో దేవాదాయ భూమిని లీజుకు ఇచ్చారు. అందులో రూ.70 కోట్లతో రాధాకృష్ణ, వెంకటే శ్వరస్వామి ఆలయాలు, కల్చరల్‌ ఎక్స్‌పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, మెడిటేషన్‌ హాల్, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం నిర్మిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో  హరేకృష్ణ హరేరామ మూమెంట్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ (బెంగళూరు) మధు పండిట్‌ దాస్, ఆంధ్రా తెలంగాణా అధ్యక్షులు సత్యగౌరి చందన దాస్, మంత్రులు శ్రీ‌రంగ‌నాథ‌రాజు, ఆదిమూల‌పు సురేష్‌, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎంపీలు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top