నేడు వైయ‌స్ఆర్ సున్నావ‌డ్డీ న‌గ‌దు విడుద‌ల‌

డ్వాక్రా అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ వ‌రుస‌గా నాల్గ‌వ ఏడాది అమ‌లు

1,05,13,365 మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.1,353.76 కోట్లు

అమ‌లాపురంలో బ‌ట‌న్ నొక్కి విడుద‌ల చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నేటితో క‌లిపి అందించిన‌ మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు

తాడేప‌ల్లి: అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ వరుసగా నాలుగో ఏడాదీ వైయ‌స్ఆర్  సున్నా వడ్డీ (మహిళలు) పథకం అమలుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్ట‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో నేడు జమ చేయనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. ఈ రూ.1,353.76 కోట్లతో కలిపి వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తోంది. 

బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా, వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైయ‌స్ఆర్ చేయూత‌, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం, వైయ‌స్ఆర్ ఆసరా, వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం బాటలు వేసింది.

ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకులతో మాట్లాడి వడ్డీరేట్లు తగ్గింపచేయడంతో అక్కచెల్లె­మ్మలపై రూ.1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. దీంతో ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకుని.. వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ.. రుణాల రికవరీలో సైతం 99.67 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అక్కచెల్లెమ్మలు ఆర్థిక పరిపుష్టిని సాధించారు. ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటివి చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7,000 నుంచి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్‌ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. 

తాజా వీడియోలు

Back to Top