కేబినెట్ స‌మావేశం ప్రారంభం

అమ‌రావ‌తి:   ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ కొద్దిసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. ఈ సమావేశంలో అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్‌-1, 2 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ బదులు.. జీపీఎస్‌ అమలుపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలపనుంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది. 

తాజా వీడియోలు

Back to Top