రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

తాడేపల్లి: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరవ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జాతికి మ‌రింత సేవ చేయాల‌ని ఆకాంక్షిస్తున్నా’నని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
 

Back to Top