కాసేపట్లో ఓర్వకల్లుకు సీఎం వైయస్‌ జగన్‌

సీఎం చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభోత్సవం 

కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చేరుకోనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ మరికొద్దిసేపట్లో ఓర్వకల్లుకు చేరుకోనున్నారు. ఓర్వకల్లులో నూతనంగా నిర్మించిన ఎయిర్‌పోర్టును సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విమానాశ్ర‌యం ప్రాంగ‌ణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మధ్యాహ్నం 12:12కు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు.. అనంతరం మ‌ధ్యాహ్నం 12:18కి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మించారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. 

తాజా వీడియోలు

Back to Top