యువ ఐపీఎస్‌ల‌కు ఆల్ ద బెస్ట్ చెప్పిన ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని శిక్ష‌ణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. విధి నిర్వహణలో సమర్థ‌వంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మార్గనిర్ధేశం చేశారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లకు ఆల్‌ ద వెరీ బెస్ట్ చెప్పారు. ముఖ్యమంత్రిని క‌లిసిన వారిలో యువ ఐపీఎస్‌లు ధీరజ్‌ కునుబిల్లి, జగదీష్‌ అడహళ్ళి, సునీల్‌ షెరాన్, రాహుల్‌ మీనా ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top