వైయస్‌ఆర్ జిల్లా: ఎగ్జిట్‌పోల్ ఫలితాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని బాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. జాతీయ నేతలు పిలవకున్నా చంద్రబాబు వెళ్తుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఏది చెబితే అది జరగాలనే అత్యాశ చంద్రబాబుదన్నారు. చేసిన తప్పులను పక్క వాళ్లపైకి నెట్టడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు. చంద్రబాబు తన హుందాతనాన్ని కోల్పోయారని, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా చంద్రబాబు వ్యతిరేకించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. చంద్రబాబు రాబోయే ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారన్నారు. విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కనపెట్టారన్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏపీ పరువు తీస్తున్నారని, చంద్రబాబుకు దేశంలో ఎక్కడా విలువ లేదన్నారు. వచ్చేది జగనన్న రాజ్యం:శ్రీకాంత్‌రెడ్డి సర్వేలన్నీ వైయస్‌ఆర్‌సీపీకు అనుకూలంగా ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టారన్నారు. వచ్చేది జగనన్న రాజ్యం అని ధీమా వ్యక్తం చేశారు.