నాటకాలు ఆడడంలో బాబు నంబర్‌ వన్‌

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు: మంచి పరిపాలన చూసి ఓర్వలేక చంద్రబాబు వేసే వేషాలు ప్రజలంతా చూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు ఏ విధంగా పాడు చేశారో ప్రజలందరికీ తెలుసని, అందుకే ఆయనకు 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబు బుద్ధిరాలేదన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చక్కటి పాలన అందిస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు పల్నాడు, ఆత్మకూరు అంటూ డ్రామాలు ఆడుతున్నాడన్నారు. చంద్రబాబు నాటకాలు ఆడడంలో నంబర్‌ వన్‌ అన్నారు. గతంలో ప్రభుత్వం ఉందని, పోలీసులు చేతుల్లో ఉన్నారని ఎమ్మెల్యేనని చూడకుండా చంద్రబాబు తనపై కూడా దాడులు చేయించారన్నారు. పల్నాడులో అనవసరంగా గొడవలు సృష్టించి పబ్బం గడపాలని చూస్తున్నాడని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. 
 

Back to Top