ఏపీలో డైనమిక్‌ లీడర్‌ షిప్‌ ఉంది

సీఎం జగన్‌ పథకాలను ప్రశంసించిన కెనడా కాన్సుల్‌ బృందం
 

 

తాడేపల్లి: ఏపీలో డైనమిక్‌ లీడర్‌ షిప్‌ ఉందని కెనడా కాన్సుల్‌ బృందం వ్యాఖ్యానించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కెనడా కాన్సుల్‌ బృందం కలిసింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలకు కెనడా కాన్సులేట్‌ జనరల్‌ ప్రశంసించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులను కొనియాడారు. అమ్మ ఒడి పథకాన్ని కాన్సుల్‌ జనరల్‌ బృందం ప్రశంసించింది. వివిధ రంగాల్లో ఏపీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top