"అమ్మ ఒడి' పథకానికి కేబినెట్‌ ఆమోదం

ముగిసిన మంత్రివర్గ సమావేశం 
 

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి మరో కీలకమైన పథకానికి ఆమోదం తెలిపింది.  వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం సచివాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో  మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్‌ ప్రాజెక్టుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ల్యాబ్లో పరీక్షించి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  అలాగే హజ్‌ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు అందజేసే ఆర్థిక సాయాన్ని రూ.మూడు లక్షలలోపు వార్షికాదాయమున్న వారికి రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, మూడు లక్షలపైన వార్షికాదాయమున్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  
 

Read Also: ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా పీవీ నాగార్జునరెడ్డి ప్రమాణ స్వీకారం

Back to Top