రోడ్డు భద్రతపై అవగాహన కల్పించండి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

అమరావతి: రోడ్డు భద్రతపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్రాఫిక్‌ పోలీసులను, అధికారులను ఆదేశించారు. ప్రజా వేదికలో కలెక్టర్‌లు, ఎస్పీలతో రెండో రోజు సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సరైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, రోడ్డు భద్రత నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలని సూచించారు. వాహనదారులకు జరిమానా విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.

Back to Top